భారతదేశం, ఏప్రిల్ 12 -- Nirmal Accident : నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలం తూరాటి ఎక్స్ రోడ్డు వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లోకేశ్వరం మండలం రాజుర నుంచి నిర్మల్ వెళ్తున్న బస్సు నిర్మల్ నుంచి భైంసా వైపు వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇందులో గాయపడిన ప్రయాణికులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

నర్సాపూర్ (జి) తూరాటి గ్రామం వద్ద జరిగిన లారీ, బస్సు ఢీకొన్న ప్రమాదంలో మొత్తం 30 మందికి పైగా గాయాల పాలయ్యారని స్థానికులు తెలిపారు. ఒకరికి తీవ్రంగా గాయాలు కావడంతో నిర్మల్త్ జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలించే లోపు లారీ డ్రైవర్ మృతి చెందాడని పోలీసులు చెప్పారు. ఇప్పటివరకు 5 అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదస్థలంలో మరికొందరికి ప్రథమ చికిత్స చేసి వారిని ఆసుపత్రికి త...