Hyderabad, ఫిబ్రవరి 26 -- భోజనంలో చారు లేదా రసం ఉండాల్సిందే. ఎన్ని కూరలు ఉన్నా, వేపుళ్లు ఉన్నా కూడా చారు లేకపోతే ఏదో వెలితిగానే ఉంటుంది. తమిళనాడులో ప్రత్యేకమైన చారును చేస్తారు. అదే నిమ్మకాయ చారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీనిలో చింతపండు వాడాల్సిన అవసరం లేదు. ఇది పిల్లలకు కూడా ఎంతో నచ్చుతుంది. ఒక్కసారి తిన్నారంటే మీరే మళ్లీ చేసుకుని తింటారు. దీన్ని చేయడం చాలా సులభం. నిమ్మకాయ చారు రెసిపీ ఇదిగో.

నిమ్మకాయలు - రెండు

టమాటాలు - రెండు

పచ్చిమిర్చి - రెండు

ఇంగువ పొడి - చిటికెడు

పసుపు - పావు స్పూను

జీలకర్ర పొడి - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

రసం పొడి - ఒక స్పూను

కందిపప్పు - అర కప్పు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

నీరు - తగినంత

నూనె - ఒక స్పూను

ఎండు మిర్చి - నాలుగు

ఆవాలు - ఒక స్పూను

జీలకర్ర - అర స్పూను

కరివేపాకులు - గుప్పెడు

దీన...