Hyderabad, జూలై 31 -- Niharika Konidela: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నటి, నిర్మాత నిహారిక కొణిదెల. తాజాగా ఇప్పుడామె కమిటీ కుర్రాళ్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరిస్తోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూల్లో తాజాగా ఆమె చైతన్యతో విడాకులు, మళ్లీ ప్రేమ, పెళ్లిలాంటి అంశాలపై స్పందించింది.

ఈ మధ్యే గ్రేట్ ఆంధ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక తన వ్యక్తిగత జీవితంపై స్పందించడం విశేషం. విడాకుల తర్వాత తన వ్యక్తిగత జీవితం మరింత మెరుగ్గా ఉందా అని అడిగినప్పుడు.. "ఇప్పుడదంతా గతం. ప్రస్తుతానికి నేను నా పనిపైనా దృష్టి సారించాను. నటనతోపాటు మంచి సినిమాలు నిర్మించడానికి ప్రయత్నిస్తాను" అని నిహారిక చెప్పింది.

మళ్లీ ప్రేమ, పెళ్లి గురించి చూస్తున్నారా అని అడిగినప్పుడు కూడా నిహారిక ఆసక్తికరమైన సమాధానం ఇచ్చిం...