భారతదేశం, ఏప్రిల్ 9 -- Nightclub roof collapse: డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగో లోని ఒక నైట్ క్లబ్ లో ప్రముఖ గాయకుడు రబ్బీ పెరెజ్ ప్రదర్శన ఇస్తుండగా, పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక బృందాలు కృషి చేస్తున్నాయి.

ప్రముఖ డొమినికన్ గాయకుడు రబ్బీ పెరెజ్ ఇచ్చే ప్రదర్శనలకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. అలాగే, మంగళవారం అర్ధరాత్రి దాటిన జెట్ సెట్ నైట్ క్లబ్ లో ఆయన ప్రదర్శన ఇస్తుండగా పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో సింగర్ పెరెజ్ కూడా మరణించాడని అతని మేనేజర్ తెలిపారు. మృతుల్లో మాజీ మేజర్ లీగ్ బేస్ బాల్ ఆటగాళ్లు ఆక్టావియో డోటెల్, టోనీ బ్లాంకో కూడా ఉన్నారు. అలాగే, మృతుల్లో మోంటే క్రిస్టీ మున్సిపాలిటీ గవర్నర్ నెల్సీ క్రూజ్ కూడా ఉన్నారని అధ్...