Hyderabad, ఫిబ్రవరి 12 -- మంచి ఆరోగ్యానికి మొదటి నియమం ఆరోగ్యంగా తినడం. రోజూ కొన్ని వ్యాయామాలతో సమతులాహారం తీసుకుంటే అనేక జీవనశైలి వ్యాధుల ముప్పు తప్పుతుంది. అయితే, మీరు ఆహారంలో ఏమి తింటున్నారో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఆధునిక శాస్త్రం కావచ్చు లేదా ఆయుర్వేదం కావచ్చు, తినడానికి సరైన సమయం చాలా ముఖ్యం. రాత్రిపూట తినకూడని కొన్ని పదార్థాలు ఉన్నాయి. రాత్రిపూట ఈ ఆహారాలు తింటే అవి అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. వీటిని తినడం వల్ల జీర్ణ సంబంధ వ్యాధులతో పాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రిపూట ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం.

రాత్రి పడుకునే ముందు చల్లటి పదార్థాలు తినడం మానుకోవాలి. పెరుగు, అన్నం, పుచ్చకాయ, చెరకు రసం, పైనాపిల్ ఇలా ఎన్నో పదార్థాలు చాలా చల్లగా ఉంటాయి. వీటిని రాత్రిపూట తినడం వల్ల కఫ సమస్యలు వస్తాయి. ఇది శ...