భారతదేశం, ఫిబ్రవరి 4 -- Nidadavole Cheating: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువతిని హాస్టల్లో కలిసి చిన్ననాటి స్నేహితురాలు, ఆమె భర్త కలిసి రెండున్నర కోట్లు కాజేశారు. యువతి భయాన్ని ఆసరా చేసుకుని బాధితురాలి నగ్న వీడియోలు తమ దగ్గర ఉన్నాయని భయపెట్టి రెండున్నర కోట్లు వసూలు చేశారు. ఇంకా డబ్బు కోసం వేధిస్తుండటంతో వాటిని తాళలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

బాధితురాలి నగ్న వీడియోలు ఉన్నాయని, డబ్బులు ఇవ్వక పోతే వాటిని ఇంటర్నెట్‌లో పెడతానంటూ బెదిరించి రూ.2.53 కోట్లు కాజేసిన యువకుడిని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పోలీసులు అరెస్టు చేశారు.

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ అక్కడే ఓ వసతి గృహంలో ఉంటోంది. అదే హాస్టల్లో కొద్ది రోజుల క్రితం క...