భారతదేశం, ఫిబ్రవరి 8 -- Delhi Next CM: 27 ఏళ్ల తరువాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తోంది. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఆప్ ను ఓడించి బీజేపీ పవర్ లోకి వస్తోంది. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఖాయమని కౌంటింగ్ ట్రెండ్స్ సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పుడు చర్చ బీజేపీ తరఫున ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు రానున్నారనే విషయంపై నడుస్తోంది.

ఢిల్లీ సీఎం రేసులో ప్రస్తుతం ఐదుగురు నేతలు ఉన్నారు. వారిలో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సీఎం ఎంపిక అధిష్టానం చేతిలో ఉందని, బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించే వ్యక్తి సీఎం అవుతారని ఢిల్లీ బీజేపీ నేతలు చెబుతున్నారు.

న్యూఢిల్లీ స్థానంలో ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఓడించిన తర్వాత ...