భారతదేశం, ఫిబ్రవరి 7 -- Newyork Suicide: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థి న్యూయార్క్‌లో ఆత‌్మహత్యకు పాల్పడ్డాడు. సాయికుమార్‌ రెడ్డి అనే యువకుడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అమెరికాలోని న్యూయార్క్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్ చేస్తూ స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల ఫెడరల్ అధికారుల తనిఖీల్లో భాగంగా సాయి కుమార్‌ రెడ్డి పాస్‌పోర్ట్‌ను సీజ్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన యువకుడు పనిచేస్తున్న కార్యాలయంలోనే ఆత్మ‌హత్యకు పాల్పడ్డాడు. అతని ఆత్మహత్య గురించి కుటుంబ సబ్యులకు కూడా సమాచారం అందలేదని స్నేహితులు అమెరికా నుంచి తెలుగు టీవీ ఛానళ్లకు సమాచారం అందించారు. ఈ మేరకు ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

కుటుంబ సభ్యుల వివరాలు లేకపోవడంతో ఆత్మహత్య విషయం వారికి చేరవేయలేకపోయినట్టు చెబుతున్నారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితమే...