భారతదేశం, సెప్టెంబర్ 1 -- అత్యంత సుందరమైన లొకేషన్స్​ మధ్య లేదా నిశ్శబ్దమైన సరస్సు ఒడ్డున జీవితం గడపాలని కలలు కంటున్నారా? అయితే, న్యూజిలాండ్ మీ తదుపరి గమ్యస్థానం కావచ్చు! సుందరమైన బీచ్‌లు, పచ్చని ప్రకృతి మధ్య ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునే వారికి, కెరీర్ అవకాశాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి న్యూజిలాండ్ మంచి ఆప్షన్​గా నిలుస్తోంది.

అంతేకాదు, న్యూజిలాండ్ రెసిడెన్స్ వీసా, పర్మినెంట్ రెసిడెన్సీ (పీఆర్)లను అందిస్తుంది. అయితే, న్యూజిలాండ్ పీఆర్ కోసం ఎలా అప్లై చేయాలో ఇక్కడ తెలుసుకుందాము..

న్యూజిలాండ్ పర్మనెంట్ రెసిడెన్సీ (పీఆర్) అంటే పర్మనెంట్ రెసిడెంట్ వీసా (పీఆర్‌వీ) కలిగి ఉండటం. మీరు మొదట పొందే రెసిడెంట్ వీసా లాగా కాకుండా, పీఆర్‌వీకి ప్రయాణ నిబంధనలు ఉండవు. ఇది మీకు దేశంలో నిరవధికంగా నివసించడానికి, పని చేయడానికి, చదువుకోవడానికి వీలు కల్...