భారతదేశం, డిసెంబర్ 23 -- త్వరలోనే కొత్త సంవత్సరం రాబోతోంది. 2025 పూర్తి అవ్వబోతోంది, 2026 లోకి అడుగు పెట్టబోతున్నాము. అయితే 2026 లో అదృష్టం కలిసి రావాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలన్నా ఈ వాస్తు నియమాలను పాటించడం మంచిది. వీటిని కొత్త సంవత్సరం మీ ఇంటికి తీసుకువస్తే అన్ని శుభాలే కలుగుతాయి. ఆనందంగా ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. మరి కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు వేటిని ఇంటికి తీసుకురావాలి? వేటి వల్ల సమస్యలు రాకుండా ఉంటాయి? అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ యంత్రం లక్ష్మీదేవికి చిహ్నం. శ్రీ యంత్రాన్ని ఇంటికి తీసుకు రావడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. శ్రీ యంత్రాన్ని ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రంలో పెట్టి ఇంట్లో ఉంచండి. పూజ గది లేదా ఆఫీస్ డెస్క్ పై పెట్టుకోవచ...