భారతదేశం, జనవరి 1 -- ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలని అనుకుంటారు. కొత్త సంవత్సరం ఏ బాధ లేకుండా సంతోషంగా సాగాలనే కోరిక అందరిలో ఉంటుంది. అలా ఉండాలంటే కొత్త సంవత్సరం (New Year 2026) ఇలా చేయండి. న్యూ ఇయర్ నాడు ఈ విధంగా చేయడం వలన మీ కలలు నెరవేరుతాయి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొత్త సంవత్సరం వీటిని పాటిస్తే ఏడాది అంతా ఆనందంగా ఉండొచ్చు.

కొత్త సంవత్సరం మొదటి రోజు సక్సెస్ అవ్వడానికి మొదటి మంత్రం త్వరగా నిద్ర లేవడం. త్వరగా నిద్ర లేవడం వలన మీ శరీరం స్వచ్ఛంగా మారుతుంది. మీ మెదడు అవకాశాలను వెతకడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే సనాతన ధర్మంలో సూర్యుని ఆరాధించడం వలన అదృష్టం కలిసి వస్తుంది.

కనుక కొత్త సంవత్సరంలో అన్నీ కలిసి రావాలన్నా, అదృష్టం పెరగాలన్నా సూర్యుడిని ఆరాధించండి. సూర్యుణ్ణి ఆర...