భారతదేశం, ఫిబ్రవరి 19 -- New Income tax bill 2025: కొత్త ఆదాయ పన్ను బిల్లు ప్రకారం.. గడువు తేదీ ముగిసిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేస్తే రిఫండ్స్ పొందడానికి అర్హత ఉంటుందా? అనే విషయంలో పన్ను చెల్లింపుదారుల్లో ఆందోళన నెలకొంది. ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసే వారు రిఫండ్ క్లెయిమ్ చేసుకోవడానికి అర్హులు కారని ఈ కొత్త బిల్లులో నిబంధన ఉందని సోషల్ మీడియాలో పలు వార్తలు సూచించాయి. ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం, 1961 లో ఈ నిబంధన లేదు. ఈ చట్టం ప్రకారం ఇది మదింపు సంవత్సరంలో ఆలస్యంగా, అంటే, డిసెంబర్ 31 లోగా రిటర్న్ సమర్పించినట్లయితే రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు.

2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న కొత్త ఆదాయ పన్ను చట్టం గడువులోగా రిటర్నులు దాఖలు చేయడంలో విఫలమైన పన్ను చెల్లింపుదారులకు రీఫండ్ లకు క్లెయిమ్ చేసే అవకాశాన్ని తొలగించవచ్చని ...