Hyderabad, ఏప్రిల్ 4 -- Zee Telugu Dheerga Sumangali Bhava Serial TV Premiere: ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్టులతో సాగే సీరియల్స్‌ను అందిస్తున్న జీ తెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగే ధారావాహికను ప్రసారం చేసేందుకు సిద్ధంగా ఉంది. ఆకట్టుకునే కథ, కథనం ప్రేక్షకులను అలరించేందుకు జీ తెలుగు అందిస్తున్న సరికొత్త సీరియల్ 'దీర్ఘ సుమంగళీ భవ'.

అమ్మమ్మ అమర్నాథ్ యాత్ర కలను సాకారం చేసేందుకు అహల్య చేసే ప్రయత్నం, విధికి బలైన అహల్య, ఇంద్ర జీవితాలతో ఈ కథ ముడిపడి ఉంటుంది. బంధాలు, బంధుత్వాల మధ్య ఉద్వేగభరితంగా సాగే సీరియల్ 'దీర్ఘ సుమంగళీ భవ' జీ తెలుగులో అలరించడానికి రెడీగా ఉంది.

అహల్య (మహీ గౌతమి) టైలర్‌గా పనిచేస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న తన అమ్మమ్మను అమర్‌నాథ్ యాత్రకు తీసుకెళ్లాలని కలలు కంటుంది. అక్కడ ఇంద్ర (పవన్ రవీంద్ర) అనే సైనికుడితో ప్రేమలో పడుతుం...