భారతదేశం, మార్చి 11 -- New Ration Card : కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకే విధంగా ఆహార భద్రత కల్పించేందుకు ఆధార్ తో రేషన్ కార్డులను అనుసంధానం చేస్తుంది. ఎక్కడైనా ఒక ఆధార్ నంబర్ రేషన్ కార్డుకు అనుసంధానమై ఉంటే మరో కొత్త కార్డుకు దరఖాస్తు చేయలేం. కొత్తగా వివాహం చేసుకున్న మహిళలు ఈ విషయం గమనించడంలేదు. చాలా మందికి తమ పుట్టింట్లో ఉన్న రేషన్ కార్డులో పేర్లు ఉంటాయి. మెట్టినింటికి వచ్చిన అనంతరం నూతన కార్డు కోసం దరఖాస్తులు చేసినప్పుడు అవి తిరస్కరణకు గురవుతున్నాయి. అయితే వీరు పాత కార్డులోని తమ వివరాలను తొలగించాలని అధికారులు సూచిస్తు్న్నారు.

వివాహం జరిగిన మహిళలు తమ పుట్టింట్లో ఉన్న రేషన్ కార్డు లో తమ పేరు తొలగించుకోవాలంటే తెల్ల కాగితంపై స్థానిక తహసీల్దారుకు అభ్యర్ధన పెట్టాలి. అత్తారింట్లో కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటున్నామని, పేరు తొలగించాలని రా...