తెలంగాణ,హైదరాబాద్, జనవరి 31 -- హైదరాబాద్ నగరంలో కొత్త ఉస్మానియా ఆస్పత్రికి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూమిపూజ చేశారు. గోషామహల్‌ స్టేడియం వేదికగా ఆధునిక హంగులతో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే డిజైన్ ఖరారైంది.

స్టాఫ్‌, మెడికల్‌ స్టూడెంట్స్‌ కోసం ప్రత్యేక భవనాలు నిర్మిస్తారు. రూ.2,700 కోట్ల వ్యయంతో 26.30 ఎకరాల్లో 32 లక్షల చదరపు అడుగుల మేర భవనాలు ఉంటాయి. మొత్తం 8 బ్లాకులు, 14 అంతస్తుల్లో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ భూమి పూజ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....