భారతదేశం, ఫిబ్రవరి 13 -- ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టారు. గత వారం కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత గురువారంనాడు నిర్మలా సీతారామన్ సభ ముందుకు తీసుకొచ్చారు. లోక్‌సభలో విపక్షాల నిరసనల మధ్య ఆర్థిక మంత్రి బిల్లును సభలో ప్రవేశపెట్టారు. విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. కాసేపటికి లోక్‌సభ మార్చి 10 నాటికి వాయిదా పడింది. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం అమలులో ఉంది. దీని స్థానంలో కేంద్రం కొత్త చట్టం తీసుకువస్తుంది. దీనిలో భాగంగానే పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టారు. 1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టంలో ఇప్పటివరకు ఎన్నో సవరణలు జరిగాయి. దీంతో ఈ చట్టాన్ని సమీక్షించి.. సరళభతరం చేస్తామని గతంలో...