భారతదేశం, ఫిబ్రవరి 12 -- New Income Tax Bill: కొత్త ఆదాయ పన్ను చట్టం త్వరలోనే అమల్లోకి రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం కొత్త బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ ముసాయిదా బిల్లు సరళంగా, సులభంగా అర్థం చేసుకునేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త చట్టంలో కఠిన పదజాలం లేదని, నిబంధనలను అర్థం చేసుకోవడం సులభంగా ఉందని తెలిపారు. ''ఇందులో కొత్త పన్ను విధానం డిఫాల్ట్ ఆప్షన్. కాబట్టి, పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాలనుకునే పన్ను చెల్లింపుదారులు కొత్త విధానం నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది'' అని ముంబైకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ సీఏ చిరాగ్ చౌహాన్ చెప్పారు.

1. తక్కువ పేజీలు: 2024లో సవరించిన ఆదాయపు పన్ను చట్టం 1961లో 823 పేజీలు ఉండగా, కొత్త ఆదాయపు పన్ను బిల్లులో 622 పేజీలు ఉన్నాయి. కాబట్టి ఇది 201 పేజీలు చిన్నది.

2. వ...