భారతదేశం, ఫిబ్రవరి 17 -- మీరు కూడా హైవేపై ప్రయాణించి ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగిస్తుంటే తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఫిబ్రవరి 17 నుండి భారతదేశం అంతటా ఫాస్ట్‌ట్యాగ్ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇది డిజిటల్ టోల్ చెల్లింపులను సులభతరం చేయడం, మోసాన్ని అరికట్టడం, టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్టీహెచ్) ఈ కొత్త నిబంధనలను అమలు చేశాయి. ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్‌లో ఎలాంటి మార్పులు జరిగాయో చూద్దాం..

ఫాస్ట్‌ట్యాగ్‌లో తగినంత బ్యాలెన్స్ లేకుండా ఉంటే అది బ్లాక్‌లిస్టులోకి వెళ్తుంది. టోల్‌ప్లాజా రీడర్ వద్దకు చేరుకొనే ముందు 60 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు ఫాస్ట్‌ట్యాగ్‌ ఇన్‌యాక్టివ్‌లోనే ఉంటే.. కోడ్ 176 ఎర్రర...