భారతదేశం, ఫిబ్రవరి 18 -- New Delhi CM: తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం ఫిబ్రవరి 20వ తేదీన ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వివిధ రాష్ట్రాల్లోని ఎన్డీఏ పక్షాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే, ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో మాత్రం బీజేపీ నేతలెవరూ పెదవి విప్పడం లేదు.

దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తోంది. అందువల్ల, బీజేపీ కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. అందుకు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించింది. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1975లో జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో తొలి మెగా నిరసన జరిగిన చారిత్రక రామ్ లీలా మైదానంలోనే కొత్త ముఖ్యమంత్రి...