భారతదేశం, మే 7 -- ఇంట్లో ఫ్రిజ్ ఉన్నా.. మట్టి కుండలోని నీరు తాగితే వచ్చే సంతృప్తి వేరేలా ఉంటుంది. చాలా మంది వేసవి రాగానే మట్టి కుండలను కొనడం ప్రారంభిస్తారు. అందులో నీరు పోసి తాగుతారు. ఇది ఇప్పటి నుంచే కాదు మన తాతముత్తాతల కాలం నుంచి ఫాలో అవుతున్న పద్ధతి. వేసవిలో మట్టి కుండలోని నీటిని తాగితే చల్లగా ఉండటమే కాదు.. ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు దక్కుతాయి. సామాన్యుడి ఫ్రిజ్ మట్టి కుండ.

కానీ చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. మట్టి కుండను కొనగానే.. నేరుగా నీరు పోసి ఇక తాగేస్తుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. మట్టి కుండను కొని తీసుకొచ్చిన వెంటనే అందులోని నీటిని తాగకూడదు. ఆరోగ్యానికి మంచిది కాదు. దాని కోసం కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని కచ్చితంగా ఫాలో కావాల్సిందే.

సామాన్యులకు వేసవిలో దాహార్తిని తీర్చేందుకు మట్టి కుండలోని తాగునీరు వరం. వేసవిలో కొ...