Hyderabad, ఏప్రిల్ 22 -- Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్ మరో రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సిరీస్ పేరు ది రాయల్స్. ప్రముఖ బాలీవుడ్ నటీనటులు ఇషాన్ ఖట్టర్, భూమి పెడ్నేకర్, జీనత్ అమన్, నోరా ఫతేహిలాంటి వాళ్లు నటించిన ఈ సిరీస్ ట్రైలర్ ను మంగళవారం (ఏప్రిల్ 22) రిలీజ్ చేశారు. మోర్పూర్ రాయల్ కుటుంబం చుట్టూ తిరిగే కథ ఇది.

ఒకప్పటి రాచరికాన్ని, అప్పటి విలాసవంతమైన జీవితాన్ని ఈ కాలంలోనూ కొనసాగించి అప్పుల పాలయ్యే ఓ రాజకుటుంబం కథే ది రాయల్స్ వెబ్ సిరీస్. ఈ సరికొత్త సిరీస్ మే 9 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. మోర్పూర్ అనే రాజవంశం విలాసాలకు పోయి అప్పుల పాలవుతుంది.

ఆ సామ్రాజ్యానికి వారసుడిగా అవిరాజ్ సింగ్ (ఇషాన్ ఖట్టర్) ఉంటాడు. మరోవైపు జీవితంలో ఓ పెద్ద వ్యాపార...