Hyderabad, ఫిబ్రవరి 3 -- Netflix Upcoming Movies Web Series: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాది ఎన్నో ఇంట్రెస్టింగ్ ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఇందులో కీర్తి సురేష్ నటించిన బోల్డ్ వెబ్ సిరీస్ అక్కాతోపాటు మాధవన మూవీ ఆప్ జైసే కోయి, ఢిల్లీ క్రైమ్ సీజన్ 3, రానా నాయుడు సీజన్ 2లాంటి వెబ్ సిరీస్, మూవీస్ ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాది తమ ప్లాట్‌ఫామ్ పైకి రాబోతున్న కంటెంట్ గురించి టీజర్లతో అభిమానులను ఫిదా చేసేసింది. 2025లో ఈ ఓటీటీలోకి ఎన్నో సూపర్ హిట్ వెబ్ సిరీస్ కొత్త సీజన్లు, కొత్త వెబ్ సిరీస్ లు, సినిమాలు రానున్నాయి. మరి అవేంటో చూసేయండి.

కీర్తి సురేష్ నటిస్తున్న అక్కా వెబ్ సిరీస్ త్వరలోనే రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఓ టీజర్ ద్వారా వెల్లడించింది. ఈ టీజర్ చాలా ఇంటెన్స్ గా ఉంది. కీర్తి సురేష్ చాలా బ...