Hyderabad, ఫిబ్రవరి 21 -- Netflix Top Trending: ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో ఈవారం టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్ వచ్చేసింది. ఇండియా వరకు చూసుకుంటే నేరుగా ఓటీటీలోకే వచ్చిన కామెడీ థ్రిల్లర్ మూవీ.. ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ పై రూపొందించిన డాక్యుమెంటరీ తొలి స్థానాల్లో కొనసాగుతుండటం విశేషం.

నెట్‌ఫ్లిక్స్ లో ప్రతివారం టాప్ ట్రెండింగ్ జాబితా మారుతూ ఉంటుంది. తాజా వారానికి సంబంధించిన ట్రెండింగ్ లిస్ట్ కూడా వచ్చేసింది. ఇందులో కామెడీ థ్రిల్లర్ మూవీ ధూమ్ ధామ్ (Dhoom Dhaam) తొలి స్థానంలో ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకే వచ్చిన విషయం తెలిసిందే.

ఓ పెళ్లయిన జంట తమ తొలి రాత్రి రోజే ఎలా చిక్కుల్లో పడుతుంది? అందులో నుంచి ఎలా బయటపడుతుంది అన్నది ఈ సినిమాలో చూడొచ్చు. నవ్విస్తూనే మంచి థ్రిల్ పంచుతున్న ఈ సినిమాకు ప్రేక్ష...