Hyderabad, ఏప్రిల్ 22 -- Netflix Top Trending: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ వస్తూనే ఉంటాయి. వీటిలో టాప్ 10 ట్రెండింగ్ జాబితా కూడా మారిపోతూనే ఉంటుంది. ఇక ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 22 వరకు గడిచిన వారం రోజుల్లో టాప్ ట్రెండింగ్ సినిమాల జాబితాలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో తొలి స్థానంలో హిందీ బ్లాక్‌బస్టర్ ఛావా ఉంది. బాక్సాఫీస్ దగ్గర కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ మూవీ.. ఓటీటీలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా టాప్ లోనే కొనసాగుతోంది. ఇక తర్వాతి స్థానంలో తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీ కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ మూవీ ఉంది.

ఈ సినిమా కూడా అటు థియేటర్లలో దుమ్ము రేపిన తర్వాత ఓటీటీలోనూ చెలరేగుతోంది. ఇండియాలో రెండో స్థానంల...