Hyderabad, మార్చి 24 -- Netflix Top Trending: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ప్రతి వారం టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ జాబితా మారుతూ ఉంటుంది. వీటిలో లేటెస్ట్ గా అడగుపెట్టిన సినిమాలు, సిరీస్ టాప్‌లోకి దూసుకెళ్తుంటాయి. అలా తాజాగా తమిళ కామెడీ మూవీ డ్రాగన్ సినిమా జాబితాలో తొలి స్థానంలో ఉండగా.. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ వెబ్ సిరీస్ లలో టాప్ లో కొనసాగుతోంది.

థియేటర్లలో మంచి విజయం సాధించిన తమిళ కామెడీ డ్రామా డ్రాగన్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనూ టాప్ లోకి దూసుకెళ్లింది. గత వారం ఈ ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ సినిమా.. మూడు రోజుల్లోనే నంబర్ వన్ గా నిలిచింది. ప్రదీప్ రంగనాథన్ నటించిన ఈ సినిమాను రూ.37 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే ఏకంగా రూ.150 కోట్లు వసూలు చేసింది.

అదే జోరును ఇప్పుడు ఓటీటీలోనూ కొనసాగిస్తోంద...