Hyderabad, మార్చి 20 -- Netflix Thriller Movie: మలయాళం థ్రిల్లర్ సినిమాలను భాషలకు అతీతంగా ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. అలా తాజాగా నెట్‌ఫ్లిక్స్ లోకి గురువారం (మార్చి 20) వచ్చిన థ్రిల్లర్ మూవీపైనా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫిబ్రవరిలో మలయాళంలో రిలీజైన 17 సినిమాల్లో ఏకైక హిట్ మూవీ ఇదొక్కటే. ఓటీటీలోనూ పాజిటివ్ రివ్యూలు సంపాదిస్తోంది.

తాజాగా నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ (Officer on Duty). ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది. కేవలం రూ. 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు థియేటర్లతోపాటు ఓటీటీలోనూ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

స్ట్రీమింగ్ కు వచ్చిన తొలి రోజే తెలుగుతోపాటు వివి...