భారతదేశం, ఫిబ్రవరి 3 -- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే చాలా మంది ఆలోచిస్తారు. ప్రత్యేకంగా దీని కోసం డబ్బులు పెట్టడం ఎందుకు అనుకుంటారు. అయితే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా వచ్చే కొన్ని రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. కొన్ని టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. రీఛార్జ్ చేస్తే ఈ ఓటీటీ సర్వీస్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఆ రీఛార్జ్ ప్లాన్స్ ఏంటో ఓసారి చూద్దాం..

రిలయన్స్ జియో రూ.1299 రీచార్జ్ 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తోంది. వినియోగదారులు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పంపవచ్చు. నెట్‌ఫ్లిక్స్(మొబైల్) సబ్‌స్క్రిప్షన్ కూడా ఈ చెల్లుబాటు కాలానికి అందుబాటులో ఉంటుంది.

యూజర్లకు రోజుకు 3 జీబీ డేటా కావాలంటే ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. 84 రోజుల వ్యాలిడిట...