భారతదేశం, మార్చి 8 -- సైబర్ నేరాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. రకరకాల రీతుల్లో సైబర్ నేరస్తులు.. జనాలను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొత్త విధానాలు పాటించి నమ్మించి డబ్బు కొల్లగొట్టేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. కొత్తగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నుంచి మెయిల్ వచ్చిందనేలా ఓ కొత్త సైబర్ స్కామ్ జరుగుతోంది. ఈ మెయిళ్ల ద్వారా మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

మీ నెట్‍ఫ్లిక్స్ అకౌంట్ హోల్డ్ అయిందని, వెంటనే పేమెంట్ వివరాలు అప్‍డేట్ చేయాలంటూ సైబర్ నేరస్తులు.. ఫేక్ ఈ-మెయిల్స్ పంపుతున్నారు. వెంటనే వివరాలు అప్‍డేట్ చేయకపోతే నెట్‍ఫ్లిక్స్ వాడలేరంటూ మెయిల్ చేస్తున్నారు. అచ్చం నెట్‍ఫ్లిక్స్ సంస్థే మెయిల్ పంపిందనేలా డిజైన్, లోగోలతో మెయిల్స్ రూపొందిస్తున్నారు. 'అప్‍డేట్ అకౌంట్ నౌ' అనే బటన్ క్లిక్ చేయాలంటూ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ...