Hyderabad, మార్చి 19 -- Netflix Releases: బ్లాక్‌బస్టర్ సినిమాల హక్కులు సొంతం చేసుకుంటూ నెట్‌ఫ్లిక్స్ దూకుడు పెంచుతోంది. తాజాగా మరో రెండు అలాంటి సినిమాలనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. వీటిలో ఒకటి మలయాళం థ్రిల్లర్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఒకటి. ఇక మరొకటి గత నెల రిలీజైన తమిళ కామెడీ డ్రామా డ్రాగన్.

నెట్‌ఫ్లిక్స్ ప్రతి వారంలాగే ఈవారం కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. అందులో భాగంగా గురువారం (మార్చి 20) మలయాళం థ్రిల్లర్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీని స్ట్రీమింగ్ చేయనుంది. కుంచకో బొబన్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

కేవలం రూ.12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.50 కోట్లు వసూలు చేసింది. ఓ నకిలీ గోల్డ్ చెయిన్ ను తాకట్టు పెట్టడ...