భారతదేశం, ఏప్రిల్ 15 -- తమిళ ఇండస్ట్రీలో చాలా క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు వచ్చాయి. కొన్ని సినిమాలు బ్లాక్‍బస్టర్ సాధించాయి. డిఫరెంట్ స్టోరీలతో కొన్ని సినిమాలు తెరకెక్కాయి. కొన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు ఉన్నాయి. వాటిలో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తప్పక చూడాల్సిన ఐదు తమిళ క్రైమ్ థ్రిల్లర్ గురించి ఇక్కడ చూడండి.

వెట్రిమారన్ దర్శకత్వంలో తమిళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం విసారనై తెరకెక్కింది. 2016లో రిలీజైన ఈ సినిమా ప్రశంసలను దక్కించుకోవటంతో పాటు కమర్షియల్‍గానూ సక్సెస్ అయింది. ఈ మూవీలో అట్టకత్తి దినేశ్, సముద్రఖని, మురగదాస్, కిశోర్, రామదాస్ ప్రధాన పాత్రలు పోషించారు. చేయని దొంగతనానికి నలుగురు యువకులు పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టడం, ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితుల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. విసారనై సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో...