భారతదేశం, జనవరి 21 -- నెట్‌ఫ్లిక్స్‌లోకి ఈ మధ్యే వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తస్కరీ: ది స్మగ్లర్స్ వెబ్. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చినా ఇప్పుడు మాత్రం దుమ్ము రేపుతోంది. ఇప్పటి వరకూ ఈ ఓటీటీలో వచ్చిన ఈ ఇండియన్ వెబ్ సిరీస్‌కూ దక్కని ఘనతను సొంతం చేసుకుంది. మరి అదేంటో చూడండి.

ఇండియన్ ఓటీటీ చరిత్రలో ఒక అరుదైన రికార్డు నమోదైంది. నీరజ్ పాండే క్రియేట్ చేసిన, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించిన 'తస్కరీ: ది స్మగ్లర్స్ వెబ్' (Taskaree: The Smuggler's Web) సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతోంది. గ్లోబల్ చార్టుల్లో అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇది కొరియన్ షోలను దాటి నంబర్ 1గా నిలవడం విశేషం. నెట్‌ఫ్లిక్స్ డేటా విభాగం 'టుడుమ్' (Tudum) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత వారం అంటే జనవరి 12 నుంచి 18 మధ్య ప్రపంచవ్యా...