భారతదేశం, ఫిబ్రవరి 1 -- Netflix OTT: ఓ స్టార్ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడంటే అత‌డిపై ఆడియెన్స్‌లో స్వ‌త‌హాగానే ఆస‌క్తి మొద‌ల‌వుతుంది. టాప్ డైరెక్ట‌ర్లు, భారీ బ‌డ్జెట్ సినిమాల‌తో వార‌సుల్ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయాల‌ని స్టార్లు భావిస్తుంటారు. తొలి సినిమాతోనే హీరోగా పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో వార‌సులు రీచ్ కావాల‌ని క‌ల‌లుకంటుంటారు. కానీ సైఫ్ అలీఖాన్ త‌న‌యుడు ఇబ్ర‌హీం అలీఖాన్ మాత్రం ఓటీటీ మూవీతో హీరోగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.

నాదానియన్ మూవీతో హీరోగా హిందీ చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు ఇబ్ర‌హీం అలీఖాన్‌. ఈ మూవీ థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. నాదానియన్ మూవీలో జాన్వీ క‌పూర్ సోద‌రి ఖుషి క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

నాదానియ‌...