Hyderabad, మే 24 -- Netflix Movies: నెట్‌ఫ్లిక్స్ ప్రపంచంలోని ప్రముఖ ఓటీటీల్లో ఒకటి. దీనికి ఇండియాలోనూ క్రమంగా ప్రేక్షకులు పెరుగుతున్నారు. మిగిలిన ఓటీటీలతో పోలిస్తే కాస్త ఖరీదైనదే అయినా.. క్వాలిటీ సినిమాలు, వెబ్ సిరీస్ ద్వారా ఈ ఓటీటీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఇండియన్ సినిమాలు, షోలకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో ఒక్క ఏడాదిలోనే 100 కోట్ల వ్యూస్ రావడం విశేషం.

నెట్‌ఫ్లిక్స్ శుక్రవారం (మే 24) తన రెండో ఎంగేజ్‌మెంట్ రిపోర్టును వెలువరించింది. దీని ప్రకారం 2023 ఏడాదికిగాను ఇండియన్ సినిమాలు, షోలకు ఏకంగా 100 కోట్ల వ్యూస్ వచ్చాయి. "వాట్ వి వాచ్డ్: ఎ నెట్‌ఫ్లిక్స్ ఎంగేజ్‌మెంట్ రిపోర్టు" పేరుతో ఈ రిపోర్టును సదరు ఓటీటీ రిలీజ్ చేసింది. గతేడాది జులై నుంచి డిసెంబర్ మధ్య కాలానికి ఈ రిపోర్టును తీసుకొచ్చింది.

గతేడాది రెండో అర్ధభాగంలో ప్రపంచవ్యాప్తంగా 9000...