Hyderabad, జనవరి 29 -- Netflix Greatest Rivalry Documentary: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చిన తర్వాత ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీసే కాదు.. డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి. అలాంటిదే మరో డాక్యుమెంటరీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది. ఏ దాయాదులు క్రికెట్ ఆడితే ప్రపంచమే ఆగిపోతుందో ఆ ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ యుద్ధం, తెరవెనుక సీన్లు, ఆ యుద్ధంలో తలపడే క్రికెటర్ల అభిప్రాయాలతో ఈ డాక్యుమెంటరీ రూపొందింది.

నెట్‌ఫ్లిక్స్ లోకి గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ (Greatest Rivalry: India vs Pakistan) పేరుతో ఓ ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ రాబోతోంది. ఫిబ్రవరి 7 నుంచి ఈ కొత్త డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. బుధవారం (జనవరి 29) దీనికి సంబంధించి ఓ ట్రైలర్ ను కూడా నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది.

"అతిపెద్ద రైవల్రీ ఎలా ఉంటుందో దానిని అనుభవించిన...