Hyderabad, మార్చి 5 -- Netflix Crime Thriller Web series: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు కేరాఫ్ అయిన నెట్‌ఫ్లిక్స్ లోకి అలాంటిదే మరో సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ పేరు ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్. ఈ సిరీస్ ట్రైలర్ బుధవారం (మార్చి 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫుల్ గన్స్, వయోలెన్స్ తో సాగిపోయిన ఈ ట్రైలర్.. సిరీస్ ఎలా ఉండనుందో చెప్పకనే చెప్పింది.

నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతున్న కొత్త వెబ్ సిరీస్ ఖాకీ: ది బెంగాల్. జీత్ మద్నానీ, ప్రొసేన్‌జీత్ ఛటర్జీ, శాశ్వత ఛటర్జీ, పరంబ్రత ఛటర్జీలాంటి వాళ్లు నటించిన ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నీరజ్ పాండే క్రియేట్ చేసిన ఈ సిరీస్ లో రక్తం ఏరులై పారనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. 2002లనాటి కోల్‌కతా, బెంగాల్ నేపథ్యంలో సాగే స్టోరీ ఇది.

సర్కారు అండతో చెలరేగిపోయి రాష్ట్రంలో అరాచకం సృష్టించే క్రిమినల్ ఓవైప...