Hyderabad, మార్చి 10 -- Netflix Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ కు పెట్టింది పేరైన నెట్‌ఫ్లిక్స్ లోకి అలాంటిదే మరో సిరీస్ వస్తోంది. అందులోనూ ఇది కొరియన్ థ్రిల్లర్ కావడం విశేషం. ఈ కే-డ్రామా పేరు కర్మ (Karma). వచ్చే నెలలో నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టబోతున్న ఈ సిరీస్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోండి.

కొరియన్ డ్రామాలు ఇండియన్ ఆడియెన్స్ ను చాలా రోజులుగా ఆకర్షిస్తూనే ఉన్నాయి. అక్కడి నుంచి వస్తున్న కంటెంట్ కు మంచి డిమాండ్ ఉంటోంది. అలా ఇప్పుడు కర్మ అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది. ఏప్రిల్ 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఆరు ఎపిసోడ్ల ఈ సిరీస్ సస్పెన్స్, థ్రిల్లర్ తో నిండిపోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ కర్మ వెబ్ సిరీస్ లో పార్క్ హే సూ, షిన్ మిన్, లీ హీ జూన్, కిమ్ సంగ్ ...