భారతదేశం, ఏప్రిల్ 12 -- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల గ్రామంలో 2017 జులైలో ఇసుక అక్రమ దందా జరిగింది. దీన్ని అడ్డుకునేందుకు యత్నించిన దళితులపై పోలీసుల కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా జాతీయ ఎస్సీ కమిషన్ తోపాటు అప్పటి లోక్‌సభ స్పీకర్ మీరా కుమారి నేరెళ్లను సందర్శించి.. బాధితులకు బాసటగా నిలిచారు.‌

అప్పటి ఘటన గురించి కొంతమంది సోషల్ మీడియా వేదికగా జాతీయ ఎస్సీ కమిషన్‌ను బద్నాం చేస్తున్నట్లు సమాచారం అందుకున్న.. కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ తీవ్రంగా స్పందించారు. దళితుల పక్షాన పనిచేసే ఎస్సీ కమిషన్‌ను నిందించడాన్ని తప్పుపట్టారు. తక్షణమే ఆ దుష్ప్రచారాన్ని ఆపాలని సూచించారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నేరెళ్ల ఘటనలో ఎస్...