భారతదేశం, సెప్టెంబర్ 10 -- నేపాల్‌లో భీకర ఆందోళనల తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు, హింస చెలరేగాయి. హింసాత్మక ఘటనలతో ఖఆట్మాండులో విధ్వంసం, మరణాలు, అగ్నిప్రమాదాలకు సంబంధించిన భయంకరమైన దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజల ఆందోళనల కారణంగా కేపీ శర్మ ఓలి ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు హిమాలయ దేశంలో శాంతిభద్రతలను పర్యవేక్షించే బాధ్యతను నేపాల్ సైన్యం చేపట్టింది. ఈ క్రమంలో సైన్యం కర్ఫ్యూ విధించింది. ఆందోళనకారులకు, ప్రజలకు సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. విధ్వంసం, దోపిడీ, లేదా వ్యక్తులపై దాడులు వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

నేపాల్​ సంక్షోభంలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వ్యక్తి సైనిక దళాల చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్. శాంతియుత మార్గం కోసం చర్చలకు రావాలని ఆయన ఆందోళనకారులకు పిలుపుని...