భారతదేశం, మార్చి 23 -- నెల్లూరు జిల్లా మన‌బోలు మండలం వ‌డ్ల‌పూడిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. సైదాపురం మండలం ఊటుకూరుకు చెందిన వ‌రుణ్ కుమార్ (17), అద‌స‌న‌ప‌ల్లి నందకిశోర్ (18) స్నేహితులు. వ‌రుణ్‌కుమార్ ఇటీవ‌ల ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు రాసి, స‌ర‌దాగా గ‌డుపుదామ‌నుకుని వారం రోజుల కిందట గొట్ల‌పాలెంలోని అమ్మ‌మ్మ ఇంటికి వెళ్లాడు. అమ్మ‌మ్మ‌, తాత‌య్య‌, కుటుంబ స‌భ్యుల‌తో పాటు త‌న స్నేహితులతో క‌బుర్లు, స‌ర‌దాల‌తో గ‌డుపుతున్నాడు. శ‌నివారం అదే ఊరుకు చెందిన స్నేహితుడు నంద‌కిశోర్ ద్విచ‌క్ర వాహ‌నంపై వ‌రుణ్ వ‌ద్ద‌కు వెళ్లాడు.

ఇద్ద‌రూ క‌లిసి ద్విచ‌క్ర‌వాహ‌నంపై గొట్ల‌పాలెంలోని సిద్ధు అనే మ‌రో స్నేహితుడి వ‌ద్ద‌కు వెళ్లారు. ఆ తర్వాత ముగ్గురూ క‌లిసి వ‌డ్ల‌పూడికి వెళ్లి తిరిగి వ‌స్తున్నారు. వ‌చ్చే క్ర‌మంలో గేదె అడ్డురావ‌డ‌తో దాన...