భారతదేశం, మార్చి 28 -- ఈ ఘ‌ట‌న నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. తిరుప‌తి జిల్లా కోట మండ‌లానికి చెందిన ఓ మ‌హిళ భ‌ర్త నుంచి విడిపోయింది. ఆమె ప్ర‌స్తుతం నెల్లూరులోని ఓ ఆసుప‌త్రిలో ప‌నిచేస్తూ లేడీస్ హాస్ట‌ల్‌లో ఉంటున్నారు. ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో సునీల్ రెడ్డి అనే వ్య‌క్తి ఫాలో అయ్యాడు. ఆమె పోస్టులను లైక్ చేస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు పెడుతూ ఆమెను ప‌రిచ‌యం చేసుకున్నాడు. తాను సినీ హీరోనంటూ మాట‌లు క‌లిపాడు. అలా ఇద్ద‌రూ ఇన్‌స్టాగ్రామ్‌లో ద‌గ్గ‌ర‌య్యారు.

ఆ ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింది. ప్రేమిస్తున్నాన‌ని, పెళ్లి చేసుకుంటాన‌ని మహిళ వ‌ద్ద‌ సునీల్ రెడ్డి ప్ర‌తిపాదించాడు. అప్ప‌టికే భ‌ర్త‌ను వ‌దిలేసి సింగిల్‌గా ఉండటంలో మ‌హిళ‌ సునీల్ రెడ్డిని త‌న‌కు తోడుగా ఉంటాడ‌ని మ‌హిళ భావించి సునీల్ రెడ్డి...