భారతదేశం, జనవరి 28 -- పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. వెంక‌టాచ‌లం మండలం క‌నుపూరు పంచాయతీ జ్యోతిన‌గ‌ర్‌కు చెందిన మొండెం కృష్ణవంశీ.. ఒక బాలిక (16)కు ప్రేమ పేరుతో మాయ‌మాట‌లు చెప్పాడు. ఆ బాలిక న‌మ్మ‌క‌పోయేస‌రికి పెళ్లి చేసుకుంటాన‌ని నమ్మ‌బ‌లికాడు. ఈ క్ర‌మంలో బాలిక‌పై పలుమార్లు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. దీంతో బాలిక గ‌ర్భం దాల్చింది. తాను గ‌ర్భం దాల్చాన‌ని మొండెం కృష్ణ‌వంశీకి బాలిక చెప్పింది. అత‌డు గ‌ర్భం తొల‌గించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

అందులో భాగంగానే బాలిక చేత‌ గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌ల‌ను బ‌ల‌వంతంగానే మింగించాడు. జ‌న‌వ‌రి 21 (మంగ‌ళ‌వారం)న బ‌ల‌వంతంగా ముత్తుకూరు మండ‌లం మామిడిపూడికి బాలిక‌ను తీసుకెళ్లాడు. అక్క‌డ బాలిక‌ను దారుణంగా కొట్టి మ‌రోసారి ఆమెపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. కృష్ణవంశీ మోసం చేస్తున్నాడ‌ని ప‌సిగ‌ట్టిన బాలిక.. ఇక లాభం లే...