భారతదేశం, జనవరి 26 -- నెల్లూరు న‌గ‌రంలోని శ్రీ‌నివాస‌న‌గ‌ర్‌లో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. నెల్లూరు న‌గ‌రంలోని జాకీర్ హుస్సేన్ న‌గ‌ర్‌లో మ‌హ‌బూబ్ బాషా (54), క‌రిమున్నీసా దంప‌తులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. వీరు బిస్కెట్లు, రొట్టెలను త‌యారు చేసి బేక‌రీల‌కు స‌ర‌ఫ‌రా చేస్తూ జీవ‌నం సాగిస్తున్నారు. అయితే వీరి కుమార్తె, అదే ప్రాంతానికి చెందిన షాహిద్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

దీంతో వీరికి వివాహం చేసేందుకు ఏడాది కిందట నిశ్చితార్థం జ‌రిగింది. షాహిద్ ప‌నుల‌కెళ్ల‌కుండా స్నేహితుల‌తో జులాయిగా తిరుగుతుండ‌టంతో.. వివాహానికి మ‌హ‌బూబ్ బాషా నిరాక‌రించారు. పెళ్లి చేయాల‌ని షాహిద్ పలుమార్లు అడిగాడు. అలాగే పెద్ద‌ల చేత కూడా ఒత్తిడి తెచ్చాడు. అయినా ఫ‌లితం లేకుండా పోయింది. జులాయిగా తీర‌గ‌డంతో త‌న కుమార్తెను ఇచ్చి ప...