భారతదేశం, డిసెంబర్ 5 -- Nelaganta Muggulu: ఇంటి గుమ్మం అందమైన రంగవల్లికలతో ముస్తాబైతే, పసిపిల్ల నవ్వులా అందంగా ఉంటుంది. పండుగ శోభ కళ్లకు కనపడుతుంది... "సంక్రాంతికి సిద్ధం అవ్వండి" అని పలుకుతున్నట్లు ఆ ముత్యాల ముగ్గు మధురంగా చెబుతున్నట్లు ఉంటుంది... తెలుగు ప్రజలకు ధనుర్మాసం అంటే ఎంతో ప్రీతి.

సంక్రాంతి నెల మొదలై ఇళ్లన్నీ కూడా ధన ధాన్యాలతో, రాసులతో ఉంటాయి. సూర్యుడు ధనుస్సు రాశిలోకి రాగానే ఆలయంలో మోగించే గంటానాదాన్ని "నెలగంట" అని పిలుస్తారు. ఈ ఏడాది ధనుర్మాసం (Dhanurmasam) ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఎప్పటి నుంచి నెలగంట ముగ్గులు వేసుకోవాలి? అనే విషయాన్ని తెలుసుకుందాం.

సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించే నెలనే ధనుర్మాసం అని పిలుస్తారు. మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ ధనుర్మాసం ముగుస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ 16న సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవే...