Hyderabad, ఫిబ్రవరి 7 -- ఇల్లు అనేది ఒక వ్యక్తికి ఎంతో ముఖ్యమైన ప్రదేశాం. బయట ఎన్ని టెన్షన్లు, బాధలు ఉన్నా కూడా విశ్రాంతి తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ చేరేది ఇంటికే. ఆరోగ్యంగా, నవ్వుతూ ఉండేందుకు ఇల్లు మంచి ప్రదేశం. కానీ ఒక్కోసారి వాతావరణం ఆహ్లాదకరంగా కనిపించదు. కుటుంబ సభ్యులతో గొడవలు, మూడ్ బాగోకపోవడం, చిన్న చిన్న విషయాలు చికాకులు పెరగడం వంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఇలా మీ ఇంట్లోనూ జరుగుతుంటే ఆ ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడానికి ఈ చిన్న పనులు చేయవచ్చు. ఆ పనులేంటో ఇక్కడ ఇచ్చాము. వీటిని ఫాలో అయితే మీ నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది.

ఇంట్లో ఉన్న పనికిరాని, ఉపయోగించని, పాత, విరిగిన వస్తువులను తొలగించండి. వాటిని అలా పోగుపోసి ఇంట్లో ఉంచకండి. తీగలు, ఛార్జర్లు, మొబైల్స్ వంటివి పాడైపోయి...