Hyderabad, మే 8 -- Neeraj Chopra: నీరజ్ చోప్రా గుర్తున్నాడు కదా.. టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ లో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి ఇండియన్ అథ్లెట్ గా చరిత్ర సృష్టించాతడు. ఇది జరిగి మూడేళ్లు అవుతోంది. కానీ ఇంత వరకూ నీరజ్.. ఇండియాలో మాత్రం జావెలిన్ విసరలేదు. మొత్తానికి ఇన్నాళ్లకు భారత అభిమానుల ఆకాంక్షలు ఫలించనున్నాయి.

జావెలిన్ త్రోయర్ అయిన నీరజ్ చోప్రా 2021లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచాడు. అయితే ఈ మూడేళ్లలో అతడు ఎప్పుడూ ఇండియాలో ఆడలేకపోయాడు. అయితే ఇప్పుడు ఆదివారం (మే 12) నుంచి ఒడిశాలో జరగబోతున్న నేషనల్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ కాంపిటీషన్స్ లో నీరజ్ పాల్గొననున్నాడు. మే 12 నుంచి 15 వరకు ఈ ఈవెంట్స్ జరగనున్నాయి.

ఈ సీజన్ డైమండ్ లీగ్ సిరీస్ లో నీరజ్ చోప్రాకు ఇదే తొలి కాంపిటిషన్ కానుంది. ...