భారతదేశం, మార్చి 23 -- 3వ తరగతి, 6వ తరగతి విద్యార్థులకు మాత్రమే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) త్వరలో కొత్త సిలబస్ ను, పాఠ్యపుస్తకాలను విడుదల చేయనుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వెల్లడించింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇతర తరగతుల పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాల్లో ఎలాంటి మార్పులు ఉండవని తన అనుబంధ పాఠశాలలకు సీబీఎస్ఈ అధికారిక సమాచారం ఇచ్చింది.

సిలబస్, టెక్ట్స్ బుక్స్ లో మార్పు కేవలం 3వ తరగతి, 6వ తరగతి విద్యార్థులకు మాత్రమేనని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. ప్రస్తుతం మూడు, ఆరో తరగతులకు సంబంధించి కొత్త సిలబస్, పాఠ్యపుస్తకాలను రూపొందించే ప్రక్రియ చివరి దశకు వచ్చిందని ఎన్సీఈఆర్టీ (NCERT) వెల్లడించింది. ఈ వివరాలను తన అనుబంధ పాఠశాలలకు సీబీఎస్సీ (CBSE) అధికారికంగా...