Hyderabad, జూలై 30 -- Nayanthara vs Doctor: సమంత చేస్తున్న హెల్డ్ పాడ్‌కాస్ట్ పై ఆ మధ్య ఓ డాక్టర్ ఎలా మండిపడ్డారో తెలుసు కదా. ఆ తర్వాత ఆమె తన పాడ్‌కాస్ట్ లకు కేవలం సమాచారం కోసమే అంటూ ఓ డిస్‌క్లెయిమర్ కూడా జోడిస్తోంది. తాజాగా నయనతార కూడా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది. మందార టీతో ఎన్నో లాభాలంటూ ఆమె చేసిన ఓ పోస్టుపై ఓ డాక్టర్ మండిపడటంతో నయన్ తీవ్రంగా స్పందించింది.

నయనతార ఈ మధ్య తన ఇన్‌స్టాగ్రామ్ లో మందార టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చెబుతూ ఓ పోస్ట్ చేసింది. డయాబెటిస్ నుంచి మొటిమల వరకు ఎన్నింటినో ఈ టీ బాగు చేస్తుందని ఆమె చెప్పింది. ఈ పోస్టుపై ఓ హెపటాలజిస్ట్ సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ స్పందించాడు. సోషల్ మీడియాలో లివర్ డాక్ గా పేరుగాంచిన ఆయన.. అభిమానులను తప్పుదోవ పట్టిస్తున్నావంటూ నయన్ పై మండిపడ్డాడు.

దీనికి నయనతార పరోక్షంగా స్పందిస్తూ ఇ...