Hyderabad, ఏప్రిల్ 11 -- Tamanna Changed Clothes On Road While Movie Shooting: దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. బాలీవుడ్‌లో కూడా వరుస సినిమాలు చేస్తూ తనదైన మార్క్ క్రియేట్ చేసుకుంది. మంచు మనోజ్ శ్రీ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన తమన్నా భాటియా హ్యాపీడేస్ మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

హ్యాపీడేస్ సినిమాలో మధుగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది తమన్నా. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ అగ్ర హీరోలతో జత కట్టి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే, హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఐదేళ్లకు తమన్నా తమిళ స్టార్ హీరో కార్తీ సరసన అవారా సినిమా చేసింది. అవారా సినిమా ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే.

ఇప్పటికీ ఆవారా మూవీ పాటలు ట్రెండ్ అవుతుంటాయి. అయితే, అలాంటి అవారా సినిమాలో మొదటగా తమన్నాకు బద...