భారతదేశం, ఫిబ్రవరి 7 -- Navodaya Entrance: జవహర నవోదయ పాఠశాలల్లో ప్రవేశపరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 8న జవహర్ నవోదయ విద్యాలయాల్లో IX & XI తరగతులకు ప్రవేశ పరీక్ష జరుగనుంది. సిద్దిపేట జిల్లాలో ఉన్న 10 కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలు చేస్తున్నట్టు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ తెలిపారు.

శనివారం ఉదయం 8 నుండి సాయంత్రం 4 వరకు అమల్లో 163 BNSS అమ్మల్లో ఉంటుందన్నారు, పరీక్ష జరుగు సమయములో పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని, పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు.

పోలీస్ అధికారులు, సిబ్బంది పరీక్ష సమయంలో పెట్రోలింగ్ చేయడం జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ పరీక్ష సమయానికి గంట ముందు ...