భారతదేశం, ఏప్రిల్ 4 -- టాలీవుడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు న‌వీన్ చంద్ర‌. హీరోగానే కాకుండా విల‌న్‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా...విభిన్న‌మైన పాత్ర‌లు చేస్తూ ప్ర‌తిభావంతుడైన న‌టుడిగా పేరు తెచ్చుకున్నారు. న‌వీన్ చంద్ర హీరోగా న‌టించిన మూవీ 28 డిగ్రీ సెల్సియస్ ఏప్రిల్ 4న (నేడు) థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సంద‌ర్భంగా సినిమా విశేషాల‌తో పాటు త‌న కెరీర్ గురించి హిందుస్థాన్ టైమ్స్ తెలుగుతో న‌వీన్ చంద్ర ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. ఆ సంగ‌తులివి...

28 డిగ్రీ సెల్సియస్ ఆరేళ్ల క్రితం మొద‌లైంది. ఈ మూవీకి ముందు రిలీజైన నా సినిమాలు ఏవి స‌రైన విజ‌యాల‌ను సాధించ‌లేదు. ఈ ప్రేమ‌క‌థ‌నే న‌న్ను గ‌ట్టెక్కిస్తుంద‌ని బ‌లంగా న‌మ్మాను. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల రిలీజ్ ఆల‌స్య‌మైంది. అయినా ఇన్నేళ్ల‌లో ఈ సినిమాపై నాకున్న న‌మ్మ‌కం, ప్రేమ‌ మాత్రం కొం...